తెలంగాణపై కాంగ్రెస్, టిఆర్‌యస్ నాటకాలు: బిజెపి
ఒంగోలు: కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) తెలంగాణపై నాటకాలు ఆడుతున్నాయని, తద్వారా తమ పబ్బాలు గడుపుకుంటున్నాయని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. టిఆర్‌యస్ మంత్రుల రాజీనామా వ్యవహారాన్ని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానానికి వదిలేయడం విడ్డూరమని ఆయన సోమవారం ఒంగోలులో మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి తీరు రాష్ట్ర అభివృద్ధికి అవరోధమని ఆయన అన్నారు. కాంగ్రెస్ మోసం చేసిందని టి ఆర్‌యస్ భావిస్తే రాష్ట్రంలో రాజీనామాలు చేసి కేంద్రంలో ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతున్నారని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications
