మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా జత: భూపతి

బెంగుళూర్‌: మిక్స్‌డ్‌ డబుల్స్‌లో హైదరాబాద్‌ టెన్నిస్‌ తార సానియా మీర్జాతో జత కట్టే విషయాన్ని పరిశీలిస్తానని టెన్నిస్‌ డబుల్స్‌ ప్లేయర్‌ మహేష్‌ భూపతి చెప్పారు. సానియా ప్రతి నెలా తన ఆటను మెరుగు పరుచుకుంటోందని, ఆమె మరింత మంచి ర్యాంక్‌కు ఎగబాకుతుందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సానియాతో జత కడితే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అత్యున్నత స్థాయికి చేరుకోగలమనే నమ్మకం ఉన్నదని ఆయన అన్నారు.

భూపతి ఫ్రాన్స్‌కు చెందిన మేరీ పియర్స్‌తో కలిసి ఈసారి వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో సానియా సింగిల్స్‌పై దృష్టి కేంద్రీకరించడమే మంచిదని భూపతి అభిప్రాయపడ్డారు. సానియా అభిప్రాయం కూడా ఇదే. ఈ దశలో సానియాకు మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రధానం కాదని, ఇది నాలుగేళ్లకోసారి మాత్రమే వస్తుందని, తాను 50వ ర్యాంక్‌ దాకా ఎగబాకాలని సానియా అనుకుంటోందని, అది సాధించిన తర్వాత సానియాతో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జత కట్టవచ్చునని ఆయన అన్నారు.

భూపతితో కలిసి మిక్స్‌డ్‌ డబుల్స్‌ అడటం తనకు గౌరవమని సానియా అన్నది. తాను సింగిల్స్‌, డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఆడుతున్నానని, అది ఎప్పుడవుతుందో చూద్దామని ఆమె అన్నది. అంతకు ముందు సానియా, భూపతి వీధిలో టెన్నిస్‌ ఆడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+