వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొనసాగుతున్న జూనియర్‌ డాక్టర్ల సమ్మె

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్లు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. బుధవారంనాడు జూనియర్‌ డాక్టర్లు వినూత్న రీతిలో తమ నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలతో నిమిత్తం లేకుండా వారు సమ్మెను కొనసాగిస్తున్నారు. బస్‌ స్టాండ్లలో జూనియర్‌ డాక్టర్లు ప్రజలను కలిసి తమ సమ్మెకు గల కారణాలను వివరిస్తున్నారు. తమను అనవసరంగా పోలీసులు అరెస్టు చేస్తున్నారని, స్టేషన్లలో తమను సరిగా చూడటం లేదని వరంగల్‌లోని జూనియర్‌ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. తమ సమ్మె కొనసాగి తీరుతుందని, ఎస్మాకు భయపడేది లేదని వారంటున్నారు.

జూనియర్‌ డాక్టర్ల సంఘం నేతలను హైదరాబాద్‌లో మంగళవారంనాడు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హాస్టళ్ల నుంచి జూనియర్‌ డాక్టర్లను పంపించడానికి న్యాయస్థానం పేరును ప్రభుత్వం వాడుకోవడంపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. జూనియర్‌ డాక్టర్ల సమ్మెపై రేపు హైకోర్టులో విచారణ కొనసాగుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X