ఆయుధాల సరఫరా ముఠా పట్టివేత
ఆదిలాబాద్/ వరంగల్: మహారాష్ట్ర నుంచి మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్న ముఠాకు చెందిన ముగ్గురు వ్యక్తులను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు పిస్టళ్లు, బుల్లెట్లు, ఇతర ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ ఏరియాలో పోలీసులు నక్సలైట్ల డంప్‌ను కనుక్కున్నారు. ఈ డంప్ నుంచి పోలీసులు గ్రెనేడ్లు, లెటర్‌ప్యాడ్‌లు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుంటే, వరంగల్ జిల్లాలో పోలీసులు నక్సలైట్ల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా మహాముత్తారం మండలంలోని బొల్లపల్లి సమీపంలోని ఈ డంప్ నుంచి మందుపాతరలు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications
