ఎస్‌ఐ మృతి సంఘటనలో సిఐపై కేసు
ఖమ్మం: కాల్పుల్లో ఖమ్మం జిల్లా పాల్వంచ సబ్ ఇన్‌స్పెక్టర్ (యస్ ఐ) అశోక్ మృతి వ్యహారంలో విశాఖపట్నం అరుకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పల్లా రాజేంద్రకుమార్‌పై కేసు నమోదు చేశారు. కాల్పులకు బాధ్యులైన వారందరినీ సస్పెండ్ చేయాలని అశోక్ బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వారితో డి ఐజి మీనా చర్చలు జరుపుతున్నారు.
ఖమ్మం జిల్లా భద్రాచలంలోని జక్కం ప్యారడైజ్ హోటల్‌లో ఖమ్మం, విశాఖపట్నం పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎస్ ఐ అశోక్ మృతి చెందగా రాజేంద్రకుమార్ గాయపడ్డారు. అవగాహనలోపం వల్లనే ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు భావిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆదివాసీ లిబరరేషన్ టైగర్స్ సభ్యుడు అల్లం కృష్ణను అరకు పోలీసులు ఇంతకు మందు అరెస్టు చేశారు. అతను సమాచారం మేరకు అరకు పోలీసులు భద్రాచలంలోని హోటల్‌పై దాడి చేశారు. తమ అదుపులో ఉన్న మావోయిస్టు ఇచ్చిన సమాచారం అదే హోటల్‌లో పాల్వంచ పోలీసులు మాటు వేశారు.
అల్లం కృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు అరకు పోలీసులు హోటల్‌లో అవగాహనాలోపం ఏర్పడి రెండు పోలీసు పక్షాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇరు పక్షాల మధ్య పది రౌండ్ల వరకు ఎదురుకాల్పులు జరిగినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
