టిఆర్‌యస్ రాజీనామాలపై వైయస్‌దే నిర్ణయం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్) మంత్రుల రాజీనామాలపై ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డే నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రనేత కె. చంద్రశేఖర్‌రావుల మధ్య ఈ నెల 20వ తేదీన ఢిల్లీలోని ఎపి భవన్‌లో సమావేశం జరుగుతుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. టి ఆర్‌యస్ మంత్రుల రాజీనామాల నేపథ్యంలో, అందుకు టి ఆర్‌యస్ చూపిన కారణాల నేపథ్యంలో కెసి ఆర్‌తో వైయస్సార్ భేటీని దిగ్విజయ్ సింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
వోక్స్ వ్యాగన్ వ్యవహారం విషయంలో సిబి ఐ విచారణ జరిపించాలనే ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ముఖ్యమంత్రి సిబి ఐ విచారణకు సిద్దపడ్డారని ఆయన అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను సవాల్‌గా స్వీకరించి ముఖ్యమంత్రి సిబి ఐ విచారణకు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. దేవాలయ భూముల విక్రయంపై వచ్చిన ఆరోపణల విషయంలోనూ, వోక్స్ వ్యాగన్ విషయంలోనూ ముఖ్యమంత్రి విచారణలకు సిద్ధపడడాన్ని బట్టే తప్పులకు సంబంధించిన విషయాలను అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
