వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైకోర్టు ఆదేశంలో జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ
హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. వీరు రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి విధులకు హాజరవుతారు. రేపటి నుంచి విధులకు హాజరు కావాల్సిందిగా హైకోర్టు గురువారం జూనియర్ డాక్టర్లను ఆదేశించింది. జూనియర్ డాక్టర్ల సమ్మె కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది. జూనియర్ డాక్టర్లపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. డిమాండ్లపై కొత్త పిటిషన్ వేయాలని కోర్టు జూనియర్ డాక్టర్లకు సూచించింది.
జస్టిస్ జీవన్‌రెడ్డి కమిటీ సిపార్సులను అమలు చేయాలని జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. హైకోర్టు పలుమార్లు ఆదేశించినప్పటికీ తమ సమ్మెను కొనసాగించారు. అయితే రేపటి నుంచి తాము విధులకు హాజరవుతున్నట్లు జూనియర్ డాక్టర్లు గురువారం హైకోర్టు ఆదేశాల అనంతరం చెప్పారు.
Comments
Story first published: Thursday, July 14, 2005, 23:53 [IST]