వరంగల్‌ సభలో అందరికీ జవాబు: నరేంద్ర

హైదరాబాద్‌: వరంగల్‌లో ఈ నెల 18వ తేదీన జరిగే బహిరంగ సభలో తెలంగాణపై అందరి సందేహాలు నివృత్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌) నాయకుడు, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర అన్నారు. తమను అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ ఆ సభలో సమాధాలు చెప్తామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ బహిరంగ సభకు నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (యన్‌సిపి) నాయకుడు, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌ పవార్‌ వస్తారని ఆయన చెప్పారు.

వరంగల్‌ సభలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కూడా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి, తమ నేత కె. చంద్రశేఖర్‌ రావుల మధ్య ఈ నెల 20వ తేదీన సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జ దిగ్విజయ్‌ సింగ్‌కు 20వ తేదీని ఇచ్చామని ఆయన అన్నారు. ఉభయ నేతల మధ్య ఈ నెల 16వ తేదీన జరగాల్సిన భేటీ 20వ తేదీకి వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+