అధికారులపై సిఎంకుపట్టులేదు: వెంకటస్వామి
హైదరాబాద్:ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికిఅధికారులపై పట్టు లేకపోవడం వల్లనేతెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్‌పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు, కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ సభ్యుడు జి. వెంకటస్వామి శనివారం ఇక్కడవ్యాఖ్యానించారు. రేపురాజశేఖరరెడ్డిని కలిసి అన్ని విషయాలు చర్చిస్తానని ఆయన అన్నారు. తెలంగాణప్రాంతానికి సాగునీరు పూర్తిగా కల్పించి, నిరుద్యోగసమస్యను నిర్మూలిస్తేప్రత్యేక రాష్ట్రం అవసరం లేదనిరాజశేఖరరెడ్డి తనతో అన్నారని, అయితే తెలంగాణ ప్రాంతంలోపనిచేస్తున్న ఇంజినీర్లపై ఆయనకుపట్టులేదని వెంకటస్వామి పేర్కొన్నారు.టిఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖరరావును వెంకటస్వామిఇటీవల తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈనేపధ్యంలో రేపు వెంకటస్వామికి,రాజశేఖరరెడ్డికి మధ్య జరిగే సమావేశానికిప్రాధాన్యం ఏర్పడింది.












Click it and Unblock the Notifications
