వాన బాధితులకుపక్కా ఇళ్ళు: మంత్రి షబ్బీర్
హైదరాబాద్:నగరంలో భారీ వర్షాల వల్ల నష్టపోయినబస్తీలలో రాష్ట్ర మంత్రులుషబ్బీర్ అలీ, కోనేరు రంగారావుతదితరులు పర్యటించి బాధితులనుపరామర్శించారు. ఇళ్ళు కోల్పోయిన వారికివాంబే తరహా పక్కా ఇళ్లు నిర్మిస్తామని,తక్షణ సహాయంగా రెండు వేల రూపాయలుచెల్లిస్తామని మంత్రి షబ్బీర్ అలీప్రకటించారు. భారీ వర్షాల అనంతరంసహాయ కార్యక్రమాలను రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందాశనివారం సమీక్షించారు. శుక్రవారంసాయంత్రం తక్షణ సహాయకార్యక్రమాలు చేయని మునిసిపల్,వాటర్ వర్క్స్, ట్రాఫిక్ పోలీసుఅధికారులను ఆయన మందలించినట్టుతెలిసింది. సహాయ కార్యక్రమాల కోసంహైదరాబాద్ కలెక్టరేట్‌లోను, నగరంలో పదహారుఎమ్మార్వోకార్యాలయాల్లోను కంట్రోల్ రూమ్స్‌ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications
