తెలంగాణకు 2వేలకోట్ల ప్యాకేజి: టిఆర్‌సిసిసి డిమాండ్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి బెదిరింపులు,విమర్శలు, ఆరోపణలు భరించలేమనితెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్‌సమన్వయ సంఘం (టిఆర్‌సిసిసి)స్పష్టం చేసింది. తెలంగాణ అభివృద్ధికి 2వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజినిప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.శనివారం ఇక్కడ జరిగిన టిఆర్‌సిసిసిసమావేశానికి తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌సీనియర్ నాయకులుఉప్పునూతల పురుషోత్తమరెడ్డి,చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదనకుతాము కట్టుబడి ఉన్నామని, అయితే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినప్పుడే పుచ్చుకుంటామని టిఆర్‌సిసిసినాయకులుఅన్నారు. టిఆర్‌ఎస్- కాంగ్రెస్ పొత్తువిషయమై నిర్ణయం తీసుకోవలసిందిఅధిష్టానవర్గమేనన్న అభిప్రాయం సమావేశంలోవ్యక్తమయింది. 610 జీవోను, గిర్‌గ్లానీసిఫార్సులనుచిత్తశుద్ధితో అమలు చేయాలని సమావేశం కోరింది. ప్రత్యేక తెలంగాణరాష్ట్రం ఏర్పడితే కాంగ్రెస్ పార్టీయేప్రభుత్వం ఏర్పాటు చేయగలదని వక్తలు అన్నారు. ఈసమావేశానికి పిసిసిఅధ్యక్షుడు కె.కేశవరావు కూడాహాజరయ్యారు. తెలంగాణ అభివృద్ధికిముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేస్తున్న కృషిని టిఆర్‌సిసిసికొనియాడింది.












Click it and Unblock the Notifications
