తెలంగాణ అభివృద్ధికి సిపియం ఉద్యమాలు
హైదరాబాద్: ెతెలంగాణ సమగ్రాభివృద్ధిని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టనున్నట్లు సిపియం రాష్ట్ర కమిటీ కార్యదర్శి బి.వి. రాఘవులు చెప్పారు. పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ముఖ్యంగా తెలంగాణ సమగ్రాభివృద్దికి ఉద్యమాలు చెపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి జరగకపోవడం వల్లనే ప్రత్యేక రాష్ట్ర నినాదాలు ముందుకు వస్తున్నాయని, దీన్ని ఎదుర్కొని సమైక్య నినాదానికి బలం చేకూర్చడానికి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధే పరిష్కారమని ఆయన అన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం తాము ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించుకోవడానకి మున్సిపల్ ఎన్నికలకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. తెలంగాణ స్థానికులకు ఉద్యోగాల్లో న్యాయం చేసే 610 జీవోను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
