వివి, కళ్యాణరావులపై నయామ్ అనుచరుల గురి
హైదరాబాద్: మాజీ నక్సలైట్‌ను బెదిరించడానికి వచ్చిన మాజీ నక్సలైట్ నయామ్ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ నక్సలైట్‌ను బెదిరించడానికి వచ్చిన నయామ్ అనుచరులను స్థానికులు పట్టుకున్నారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విప్లవ రచయితల సంఘం నాయకులు వరవరరావును, కళ్యాణరావును, ఇతర పౌరహక్కుల నాయకులను చంపాలని నయామ్ తనను బెదిరిస్తున్నాడని మాజీ నక్సలైట్ గణేశ చెప్పారు.
"మీకు చంపడానికి భయమైతే మేం చంపుతాం, నేరం మీ మీద మోపుకోండి అని నయామ్ ముఠా తమను బెదిరిస్తోందని ఆయన చెప్పారు. దీన్ని బట్టి నయామ్ ముఠా వరవరరావు, కళ్యాణరావులపై తన గురి పెట్టినట్లు అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications
