టిఆర్‌యస్‌తో స్నేహాన్ని తోసిపుచ్చలేం: బిజెపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్)తో తమ పార్టీ పొత్తును తోసిపుచ్చలేమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చెన్నమనేని విద్యాసాగర రావు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టిఆర్‌యస్‌తో అవగాహనకు వచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. మున్సిపల్ ఎన్నికల తర్వాతనే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునే విషయాన్ని ఆలోచిస్తామని ఆయన చెప్పారు.
పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన నిర్ణయాన్ని తీసుకుంటామని ఆయన చెప్పారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కూడా టిఆర్‌యస్, కాంగ్రెస్‌ల మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు లేవని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
