For Daily Alerts
నిషేధంతో అజ్ఞాతంలోకి కళ్యాణరావు
హైదరాబాద్: నిషేధంతో విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర అధ్యక్షుడు జి. కళ్యాణ్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. 1970లో ఆవిర్భవించిన విరసం తొలిసారి రాష్ట్రంలో నిషేధానికి గురైంది. ప్రభుత్వం మావోయిస్టులను, దాని అనుబంధ సంస్థలను నిషేధించడానికి కొద్ది సమయం ముందు ఇంటి నుంచి వెళ్లిన కళ్యాణ్‌రావు తిరిగి ఇంటికి రాలేదు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించినట్లు ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానల్ ప్రకటించింది.
తాను ఇప్పటికీ విరసం అభిప్రాయాలకు కట్టుబడి ఉన్నానని, కావాలనుకంటే ప్రభుత్వం తనను అరెస్టు చేయవచ్చునని మావోయిస్టు మాజీ ప్రతినిధి, విప్లవ కవి వరవరరావు అన్నట్లు కూడా ఆ టీవీ ఛానల్ ప్రసారం చేసింది. కాగా నిషేధాన్ని కోర్టులో సవాల్ చేయవచ్చునని కూడా ఈ టీవీ తెలియజేసింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!