వాస్తు ప్రకారం ఇంటి ఆవరణలో ఈ మొక్కను నాటితే అదే చాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే ఇటలీలో పర్యటించినప్పుడు ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో కలిసి మల్బరీ మొక్కను నాటారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు విడుదల అయ్యాయి. దీంతో మల్బరీ ప్లాంట్ చర్చనీయాంశంగా మారింది. వాస్తు శాస్త్రం, ఆయుర్వేదం ప్రకారం మల్బరీ ప్లాంట్ కు ఎంతగానో ప్రాముఖ్యత ఉంది. మొక్కలను పెంచడం అనేది అదృష్టం, పాజిటివ్ ఎనర్జీ, మంచి ఆరోగ్యంతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. మల్బరీ మొక్క నాటడం వల్ల కలిగే సానుకూల మార్పులను, ప్రయోజనాలను పరిశీలిద్దాం.

మల్బరీ ప్లాంట్ సాంకేతిక నామం మోరస్ నిగ్రా. అంటే నల్ల మల్బరీని మొక్క. దీని విశిష్ట గుణాల వల్ల వాస్తులో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. నల్ల మల్బరీ దీర్ఘాయుష్షుకు ప్రతీకగా నిలుస్తుంది. వాస్తు ప్రకారం, ఇది సంపద స్థిరత్వానికి, కుటుంబ సభ్యుల ఆయుష్షుకు సంకేతం. ఈ మొక్కకు ఉండే బలమైన వేర్లు ఆర్థిక స్థిరత్వాన్ని, వ్యాపారం లేదా వృత్తిలో అభివృద్ధిని తెస్తాయని నమ్ముతారు.

Invite Positive Energy and Prosperity with the Auspicious Mulberry Plant Vastu a Magnet for Wealth

మొక్క పెరిగే కొద్దీ ఇంట్లో సంతోషం, శ్రేయస్సు, గౌరవం, సంపద పెరుగుతాయని భావిస్తారు. మల్బరీ మొక్కలు తమ పరిసరాల నుండి ప్రతికూల శక్తిని గ్రహించే సామర్థ్యం కలిగి ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంటి దగ్గర వీటిని నాటడం వల్ల వాతావరణం శుభ్రపడి, కుటుంబ సభ్యుల మధ్య సానుకూలత పెరుగుతుంది. ఇది నర దృష్టి, చెడు శక్తుల నుండి రక్షణ కవచంగా పనిచేస్తుంది.

మొక్క పండ్లు కాయడం మొదలుపెట్టినప్పుడు ఇంటి ఆర్థిక సమస్యలు తొలగిపోయి, సంపద వస్తుందని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. పచ్చని ఆకులు, వీటికి ఉండే శుద్ధి గుణాలు కుటుంబ సభ్యులలో మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. మల్బరీ ప్రభావం కుటుంబ సభ్యుల మధ్య తరచూ సంభవించే కలహాలను శమింపజేసి, ఇంట్లో ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ఈ పవిత్రమైన చెట్టును నాటాలనుకుంటే, కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలను పాటించాలి. మల్బరీని ఇంటి లోపల లేదా పడకగదులలో అస్సలు నాటకూడదు. దీన్ని ఎల్లప్పుడూ ఇంటి ఆవరణ, తోట, బాల్కనీలో లేదా ఇంటికి కొంత దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో నాటాలి.

వాస్తు ప్రకారం, ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉన్న పచ్చికలో లేదా తోటలో మల్బరీని నాటడం అత్యంత శుభప్రదం. మోరస్ నిగ్రా కాలక్రమేణా విస్తరిస్తుంది కాబట్టి, నాటడానికి విశాలమైన ఖాళీ స్థలం అవశ్యం. సరైన పెరుగుదల, తీయని పండ్ల కోసం, దీనికి రోజుకు 5 నుండి 6 గంటల ప్రత్యక్ష సూర్యరశ్మి అవసరం. కాబట్టి తగినంత సూర్యరశ్మి లభించే స్థలాన్ని ఎంచుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+