పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్ లోనే అత్యధికం.. కారణం ఇదే..?
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ దేశాలతో పాటు భారత్ పైనా తీవ్రంగా ప్రభావం పడింది. దేశంలో గణనీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. వారం రోజుల వ్యవధిలోనే కేంద్రం మూడు సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. మే 15 న లీటర్ కు రూ. 3, మే 19 న 90 పైసలు, పెంచింది. అలాగే తాజాగా మే 23 న పెట్రోల్ పై 87 పైసలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తంగా చూస్తే ఈ 10 రోజుల్లో లీటర్ ఇంధనంపై దాదాపు రూ. 5 భారం పెరిగింది. దీంతోపాటు దిల్లీ లాంటి నగరాల్లో సీఎన్జీ ధర కిలోకు రూ. 1 మేర పెరిగింది. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి.. అనే విషయాన్ని చూస్తే.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా రేట్లు ఉన్నాయి. హైదరాబాద్ లో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ. 112.71 గా ఉంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 100.86 గా ఉంది. ఇక దేశరాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.51 గా ఉంది. డీజిల్ ధర రూ. 92.49 గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.49 గా ఉంది. డీజిల్ ధర రూ. 95.02 గా ఉంది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.64 గా ఉంది. డీజిల్ ధర రూ. 97.02 గా ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.31 గా ఉంది. డీజిల్ ధర రూ. 96.98 గా ఉంది.

హైదరాబాద్ లో వ్యాట్ ఎక్కువగా ఉండటం కారణంగా దేశంలోనే అత్యధిక ధర హైదరాబాద్ లో ఉంది. దేశంలోని ప్రధాన నగరాలతో పోల్చితే పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్ లోనే అత్యధికంగా ఉన్నాయి. మరోవైపు వరుసగా ఇంధన ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగి.. రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications