రెస్టారెంట్ స్టైల్ 'చికెన్ ఫ్రైడ్ రైస్'.. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోండి..!

చికెన్ అనగానే చాలామందికి నోరూరుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చికెన్ ను ఇష్టంగా తింటారు. అయితే చికెన్ తో ఎప్పుడూ ఒకే రకమైన రెసిపీలు చేసుకుని బోర్ కొట్టిందా..? అయితే రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ను ఎప్పుడైనా ట్రై చేశారా..? తక్కువ పదార్థాలతో ఇంట్లోనే ఈజీగా ఈ సూపర్ టేస్టీ రెసిపీని తయారు చేసుకోవచ్చు. అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తయారీ విధానం పూర్తి వివరాలు చూస్తే..?

చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే అన్నం(వండినది) మూడు కప్పులు, బోన్ లెస్ చికెన్ ముక్కలు 200 గ్రామాలు, గుడ్లు రెండు, క్యారెట్, బీన్స్(సన్నగా తరిగినవి) ఒక కప్పు, ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిర్చి రెండు లేదా మూడు, వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్, అల్లం ఒక టేబుల్ స్పూన్, సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్, వెనిగర్ ఒక టేబుల్ స్పూన్, నూనె రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి తగినంత తీసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం చూస్తే..

Chicken Fried Rice Restaurant Style Delicious Recipe with Easy Ingredients and Quick Preparation

ముందుగా చికెన్ ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి పట్టించాలి. ఆ తర్వాత నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీలో నూనె వేసి వేడి చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, కూరగాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు గుడ్లు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అన్నం, సోయా సాస్, వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అధిక మంట మీద ఆ మిశ్రమాన్ని కదిలిస్తూ ఉండాలి. ఆ తర్వాత వేయించుకున్న చికెన్ ముక్కలను అన్నంలో వేయాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంపై ఆనియన్స్ చల్లుకోవాలి. అంతే వేడి వేడి రుచికరమైన చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే.. ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ సర్వ్ చేయడానికి సిద్ధం అయింది. మీరు కూడా ఇలా చేసుకోండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+