భారతదేశపు విశిష్ట రైళ్లు: అత్యంత సుదీర్ఘ నాన్-స్టాప్ రైలు, అతి నెమ్మదిగా నడిచే రైళ్ళు!
భారత రైల్వే నెట్‌వర్క్‌లో అనేక రైళ్లకు తమదైన రికార్డులు ఉన్నాయి. కొన్ని రైళ్లు తమ ప్రత్యేకతతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. అందులో ఒకటి తిరువనంతపురం - హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్. ఈ రైలు భారతదేశంలో అత్యంత దూరం నాన్‌స్టాప్‌గా నడిచే రైలుగా రికార్డు సృష్టించింది.
దేశంలోనే నాన్ స్టాప్ రైలు తిరువనంతపురం-హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్
కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ వరకు ప్రయాణించే ఈ రైలు రాజస్థాన్‌లోని కోటా నుంచి గుజరాత్‌లోని వడోదర వరకు ఒక్క స్టేషన్‌లో కూడా ఆగకుండా 528కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ దూరాన్ని కేవలం 6గంటల్లో చేరుకుంటుంది. ఇంతకు ముందు ముంబై-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ అతి పొడవైన నాన్‌స్టాప్ రైలుగా ఉండేది. కానీ తిరువనంతపురం-హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆ రికార్డును క్రాస్ చేసి కొత్తచరిత్ర సృష్టించింది.

నిదానంగా నడిచే రైలు హౌరా-అమృత్‌సర్ మెయిల్
ఈ రైలు మొత్తం ప్రయాణంలో అతి తక్కువ స్టాప్ లతో వేగంగా ప్రయాణికులను గమ్యస్థానానికి చేరుస్తుంది. ఒకవైపు వేగవంతమైన రైలు ఉంటే, మరోవైపు అత్యంత నెమ్మదిగా నడిచే రైలు కూడా ఉంది. హౌరా-అమృత్‌సర్ మెయిల్ రైలు నంబర్ 13005 భారతదేశంలో అతి నెమ్మదైన రైళ్లలో ఒకటి. హౌరా నుంచి అమృత్‌సర్ వరకు 1,910 కిలోమీటర్ల దూరాన్ని 37 గంటల్లో చేరుకుంటుంది.
60 స్టేషన్లలో ఆగుతూ ఏడు రాష్ట్రాల గుండా ప్రయాణం చేసే నెమ్మదైన రైలు
ఈ ప్రయాణంలో ఇది 60 స్టేషన్లలో ఆగుతుంది. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హరియాణా, పంజాబ్ వంటి ఏడు రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. చిన్న స్టేషన్లలో 2 నిమిషాలు, పెద్ద స్టేషన్లలో 5-10 నిమిషాలు ఆగుతుంది. అతి నెమ్మదైన రైళ్లలో మరొకటి మెట్టుపాలయం-ఊటీ నీలగిరి ప్యాసింజర్ ట్రైన్. కొండల మధ్య నడిచే ఈ టాయ్ ట్రైన్ గంటకు కేవలం 10 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.
అతి నిదానంగా అందాలను చూపించే మెట్టుపాలయం-ఊటీ నీలగిరి ప్యాసింజర్ ట్రైన్
46 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లో చేరుకుంటుంది. అయితే ఈ ప్రయాణంలో కనిపించే నీలగిరి కొండల అందాలు, టీ తోటలు, వన్యప్రాణులు పర్యాటకులను ఆకర్షిస్తాయి. భారత రైల్వేలు కేవలం ప్రయాణ సాధనం కాకుండా, వేగం, నెమ్మది, అందం మరియు సౌకర్యాలతో ప్రయాణికులకు వైవిధ్యమైన అనుభవాలను అందిస్తున్నాయి. తిరువనంతపురం-హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్ వేగానికి, హౌరా-అమృత్‌సర్ మెయిల్ నెమ్మదికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.













Click it and Unblock the Notifications