కెసిఆర్‌ది ఏకపక్ష ప్రేమ: నారాయణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) అధినేత కె. చంద్రశేఖర్ రావుది ఏకపక్ష ప్రేమ అని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నారాయణ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐతో కలిసి కొన్ని చోట్ల పోటీ చేస్తామని కెసిఆర్ చేసిన ప్రకటనపై ప్రతిస్పందిస్తూ ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు.
ప్రత్యేక తెలంగాణ నినాదంపై ఎన్నికల్లో పోటీ చేస్తున్న టి ఆర్‌యస్‌తో కలిసి పోటీ చేసే రాజకీయ ప్రాతిపదిక ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. సిపిఐ, సిపియం కలిసి కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకుని ఎన్నికల్లో పోటీ చేయాలనేది తమ వైఖరి ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
