వర్షానికి హైదరాబాద్ రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: భారీ వర్షంతో హైదరాబాద్ రోడ్లు జలమయ్యాయి. దాదాపు గంటన్నర పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వర్షంతో నిండిన నీరు వల్ల హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట వంటి ప్రాంతాల్లో గంటలకు గంటలు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్ల పక్కన నిలిపి ఉంచిన వాహనాలు మునిగిపోయేంతగా నీరు వచ్చి చేరింది. జల ప్రవాహానికి వాహనాలు నిలవలేదు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications
