అజర్‌కు బెదిరింపులు నిజమే: దినేష్ రెడ్డి
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజరుద్దీన్‌కు బెదిరింపులు వచ్చిన మాట వాస్తవమేనని హైదరాబాద్ పోలీసు కమీషనర్ దినేష్ రెడ్డి చెప్పారు. అజర్‌కు వచ్చిన బెదిరింపులపై విచారణ జరుగుతోందని, దానికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించడానికి వీలు కాదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. నక్సల్స్ చేతిలో మరణించి ఐపియస్ అధికారి ఉమేష్ చంద్ర వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ముంబాయి మాఫీయా ముఠా అజర్‌ను బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. అజర్ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు మహారాష్ట్ర పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అజర్‌కు హైదరాబాద్ పోలీసులు భద్రతను పెంచారు.












Click it and Unblock the Notifications
