నరేంద్రను సెంట్రల్ జైలులో పెట్టాలి: సిపిఐ
హైదరాబాద్: హింసను ప్రేరేపించే విధంగా ప్రకటనలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) నాయకుడు, కేంద్ర మంత్రి ఎ. నరేంద్రను సెంట్రల్ జైలులో పెట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. టిఆర్‌యస్ నాయకులు కె. చంద్రశేఖర్ రావు, ఎ. నరేంద్ర స్థాయిని మరిచిపోయి విమర్శలు చేస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
కమ్యూనిస్టులను విమర్శించే స్థాయి చంద్రశేఖర్ రావుకు లేదని ఆయన అన్నారు. కెసిఆర్ బావిలో కప్పలా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సత్తా వుంటే చంద్రశేఖర్ రావు సిద్ధిపేట మున్సిపాలిటీలో విజయం సాధించాలని ఆయన సవాల్ చేశారు. ఆర్‌యస్‌యస్ నాయకుడైన నరేంద్రను గద్దెనెక్కించినవారి గురించి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీతో అవగాహనకు రావాల్సిన అవసరం లేదని, బేషరతుగా తెలుగుదేశం పార్టీ మద్దతిస్తే తమకేం అభ్యంతరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
