కెసిఆర్ పాములా చొరబడ్డారు: ఎమ్మెస్సార్
విశాఖపట్నం: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతి వ్యవహారాల శాఖల మంత్రి ఎం. సత్యనారాయణ రావు విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చీమల్లా పెట్టుకున్న పుట్టలోకి తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్) నాయకుడు కె. చంద్రశేఖర్ రావు పాములా చొరబడ్డారని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌ల ఆశీస్సులతోనే టి ఆర్‌యస్ నాయకులు కె. చంద్రశేఖర్ రావుకు, ఎ. నరేంద్రకు మంత్రి పదవులు దక్కాయని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో తొందరపాటు తగదని ఆయన అన్నారు. తెలంగాణ రాదని తెలిసిన తర్వాత టిఆర్‌యస్ నాయకులు మంత్రి పదవులకు రాజీనామా చేయవచ్చు కదా అని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
