క్రికెట్: పఠాన్ ధాటికి కుప్పకూలిన జింబాబ్వే
హరారే: హరారేలో జరుగుతున్న రెండో క్రికెట్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత సీమర్ ఇర్ఫాన్ పఠాన్ ధాటికి జింబాబ్వే బ్యాటింగ్ కుప్పకూలింది. జింబాబ్వే 161 పరుగులకే ఆల్ అవుటయింది. టాస్ గెలిచిన భారత్ జింబాబ్వేకు బ్యాటింగ్ ఇచ్చింది. పఠాన్ ఏడు వికెట్లు తీసుకున్నాడు. స్పిన్నర్ హర్బజన్ సింగ్‌కు రెండు వికెట్లు లభించాయి. జహీర్‌ఖాన్‌కు ఒక వికెట్ దక్కింది.
జింబాబ్వేకు చెందిన ఏ బ్యాట్స్‌మన్ కూడా అర్థ సెంచరీ సాధించలేకపోయాడు. మొదటి టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన తైబు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ దారి పట్టాడు. బ్లిగ్నాట్, కోవెంట్రీ కొన్ని అందమైన భారీ షాట్లు కొట్టారు. అయితే భారీ స్కోర్‌ను సాధించడంలో విఫలమయ్యారు. బ్లిగ్నాట్ 13 పరుగులు మాత్రమే చేశాడు. కోవెంట్రీ 37 పరుగులు చేశాడు. టైలర్ నాలుగు పరుగులకు, డఫిన్ 12 పరుగులకు, ఇబ్రాహిం 14 పరుగులకు అవుటయ్యారు.
భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది. తొలి టెస్టు మ్యాచ్‌ను గెలుచుకున్న భారత్ ఈ మ్యాచ్‌ను కూడా గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసే లక్ష్యంతో ఆడుతోంది. కోచ్ చాపెల్‌కు, కెప్టెన్ గంగూలీకి మధ్య చెలరేగిన వివాదాన్ని బిసిసిఐ జోక్యం చేసుకుని పరిష్కరించిన సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
