వైయస్ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పై ప్రజలు వ్యక్తం చేసిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి పని చేయాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేయాలని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ వై.యస్. రాజశేఖర్ రెడ్డికి సూచించారు. మున్పిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. గెలిచిన అభ్యర్థులకు, రాష్ట్ర నాయకత్వానికి తమ నేత సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇప్పటికీ తమ మిత్రపక్షమేనని ఆయన అన్నారు. తెరాసతో కలిసి పనిచేయడానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం వై.యస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు వ్యక్తం చేసిన విశ్వాసమని, ఈ విశ్వాసాన్ని నిలబెట్టడానికి మరింత కష్టపడి పనిచేయడం అవసరమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తెరాస నేత కె. చంద్రశేఖర్ రావుకు లభించిన గుణపాఠమే బీహార్ శాసనసభ ఎన్నికల్లో లోక్‌జనశక్తి నేత రాం విలాస్ పాశ్వాన్‌కు లభిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
