నేటి జోక్‌: డబ్బులేక ఓడిపోయాం: నరేంద్ర

హైదరాబాద్‌:తమ వద్ద డబ్బు లేనందువల్లనేమునిసిపల్‌ ఎన్నికల్లో అపజయం చవిచూశామని టిఆర్‌ఎస్‌నాయకుడు,కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌, తెలుగుదేశంపార్టీలు డబ్బు సంచులతో విజయం సాధించాయనిఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణసెంటిమెంట్‌ కంటే డబ్బు ప్రభావం చూపిందని ఆయన అన్నారు. తమకుపట్టణ ప్రాంత ఎన్నికలు, ఇదే మొదటిసారని ఆయన తెలిపారు.

కొన్ని మున్సిపాలిటీలను సాధించడానికైనా కాంగ్రెస్‌ మద్దతు తీసుకుంటామని, కాంగ్రెస్‌కు సహకరిస్తామని ఆయన చెప్పారు. రాజకీయాల్లో ఇదంతా సహజమని, ఇది అవకాశవాదం కాదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో తాము చేరబోమని ఆయన స్పష్టం చేశారు. తాము తెలంగాణ జాగరణ సేనను మరింత బలోపేతం చేసి బలం పుంజుకుంటామని ఆయన చెప్పారు. మరో మూడు రోజుల్లో రామయణాలు, మహాభారతాలు చాలా జరుగుతాయని, ఐదు మున్పిపాలిటీలు తమ పార్టీ దక్కించుకుంటుందని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకుండా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు.

నరేంద్ర,చంద్రశేఖరరావుల నెత్తుటి భాషవల్లనే తెలంగాణ ప్రజలకు వారంటే భయం కలిగిందని కాంగ్రెస్‌సీనియర్‌ నాయకుడు వి. హనుమంతరావువ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+