తెలంగాణపై కూడా ప్రజలు తేల్చారు: వైయస్‌

హైదరాబాద్‌:మున్సిపాలిటీఎన్నికల తీర్పు ద్వారా రాష్ట్ర ప్రజలుతెలంగాణ అంశాన్ని తమ పార్టీ నేతసోనియా గాంధీకి వదిలేశారనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణప్రజలు సోనియా గాంధీ నాయకత్వానికిమద్దతు తెలియజేశారని ఆయనసోమవారం మీడియా ప్రతినిధులసమావేశంలో అన్నారు. తెలంగాణపైతాను అంతకన్నా ఎక్కువమాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు.తాము వెనకబడిన ప్రాంతాలఅభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని ప్రజలునమ్మారని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇప్పటికీ తమ మిత్రపక్షమేనని, హంగ్‌ ఏర్పడిన చోట్ల తాము, తెరాస పరస్పరం సహకరించుకుంటామని ఆయన చెప్పారు. పరస్పరం దూషణలు చేసుకున్న తర్వాత తెరాసతో కలిసి పని చేస్తారా అని విలేకరులు అడిగితే "నేను తిట్టలేదు కదా అని ఆయన అన్నారు. అధికార దుర్వినియోగంతో, డబ్బు సంచులతో కాంగ్రెస్‌ గెలిచిందని వ్యాఖ్యానించడం ప్రజలను కించపరచడమేనని ముఖ్యమంత్రి అన్నారు. ఏ పార్టీ ఆ విధమైన ఆరోపణ చేసిన అది ప్రజలను అవమానించడమేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+