సూపర్ సిరీస్‌లో ఆడుతా: ఇంజమామ్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ సూపర్ సిరీస్‌లో ఆడడానికి అంగీకరించాడు. వరల్డ్ ఎలెవన్, వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాల మధ్య జరిగే సూపర్ సిరీస్‌లో ఆడబోనని ప్రకటించిన 24 గంటల లోపే ఇంజమామ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. భారత బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ టెన్నిస్ ఎల్బో గాయంతో సూపర్ సిరీస్‌కు దూరం కావడంతో ఇంజమామ్‌కు అవకాశం లభించింది. మంగళవారం ఉదయం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిసి) చైర్మన్ షహర్యార్ ఖాన్‌ను కలిసిన తర్వాత ఇంజమామ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.
పాకిస్థాన్ క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా సూపర్ సిరీస్‌లో పాల్గొనాలని షహర్యార్ ఖాన్ ఇంజమామ్‌కు సూచించారు. అందుకు ఇంజమామ్ అంగీకరించాడు. సూపర్ సిరీస్‌లో పాల్గొనకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పిసిబి ఇంజమామ్‌కు నచ్చజెప్పింది.












Click it and Unblock the Notifications
