రాజీనామా వెనక్కి తీసుకోను: ఎమ్యెల్యే సీతారాం
విశాఖపట్నం: కాంగ్రెస్ భీమునిపట్నం శాసనసభ్యుడు కర్రి సీతారాం రాజీనామా నాటకం ఇంకా కొనసాగుతూనే ఉంది. భిమిలీలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన శాసనసభ సభ్యత్వానికి సోమవారంనాడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుడికి అందజేశారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరుతూ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారంనాడు సీతారాం ఇంటి ముందు ధర్నా చేశారు.
తాను రాజీనామాను ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. తాము భిమిలీని అభివృద్ధి చేసినా ప్రజలు గుర్తించలేదని మనస్తాపం చెంది వెంటనే పక్కనే ఉన్న డిసిసి అధ్యక్షుడికి రాజీనామా లేఖను అందజేశానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
