మీ ఇంటిని చక్కబెట్టుకోండి: టిడిపికి రోశయ్య సలహా
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని హుందాగా గౌరవించాలని ఆర్థిక మంత్రి కె. రోశయ్య తెలుగుదేశం పార్టీ నాయకులకు సలహా ఇచ్చారు. తనకు తమ ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డిని దించి రోశయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన సూచనపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.
జనాదరణ ఉన్న వై.యస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తమ పదవులు ఉడకవని తెలుగుదేశం పార్టీ గ్రహించిందని, అందుకే తనను ముఖ్యమంత్రిగా చేయాలని సూచించిందని ఆయన అన్నారు. "మా గురించి మాట్లాడే తెలుగుదేశం నాయకులు ముందు వారి ఇంటిని చక్కదిద్దుకోవాలి అని ఆయన సలహా ఇచ్చారు. నారా చంద్రబాబునాయుడును అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని తాను సలహా ఇవ్వడం లేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు.












Click it and Unblock the Notifications
