తెరాసలో ముసలం: నరేంద్రపై ధ్వజం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో ముసలం బయలుదేరింది. తమ నాయకత్వంపై తెరాస శాసనసభ్యులు మందాడి సత్యనారాయణ, దుగ్యాల శ్రీనివాస రావు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శలు చేశారు. తమ నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్ర భాషనే మున్సిపల్ ఎన్నికల్లో కొంప ముంచిందని మందాడి సత్యానారయణ అన్నారు. నరేంద్రనే ఓటమికి కారణమని ఆయన అన్నారు. నరేంద్ర వైఖరి వల్ల చాలా వర్గాలు పార్టీకి దూరమయ్యారని ఆయన అన్నారు.
కె. చంద్రశేఖర్‌రావు నుంచి నరేంద్ర పార్టీ పగ్గాలు తీసుకుంటారనే ప్రచారం మున్పిపల్ ఎన్నికల్లో నష్టం చేసిందని ఆయన అన్నారు. తెలంగాణ జాగరణ సేన ఏర్పాటుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని ఆయన అన్నారు. చంద్రశేఖర్ రావు క్యాడర్‌ను నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు. సొల్లు కబుర్లు చెప్పేవారిని, వందిమాగధులను కెసిఆర్ ఇకనైనా దూరం పెట్టాలని ఆయన సూచించారు. వరంగల్‌లో పార్టీ ఓటమికి మాజీ మంత్రి విజయరామారావే కారణమని దుగ్యాల శ్రీనివాసరావు అన్నారు.
ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లా తెరాస అధ్యక్షుడు హరివర్దన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరికొందరు కూడా పార్టీకి రాజీనామా చేశారు.












Click it and Unblock the Notifications
