హైదరాబాద్ క్యాంపుల్లో మున్సిపల్ కౌన్సిలర్లు
హైదరాబాద్: మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులకు జరిగే ఎన్నికల నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు హైదరాబాద్‌కు మారాయి. తమ అభ్యర్థులు విధేయతలు మారవచ్చుననే ఆందోళనతో ప్రధాన రాజకీయ పార్టీలు చాలా వరకు హైదరాబాద్‌లోనే క్యాంపులు నిర్వహిస్తున్నాయి. మున్సిపాలిటీలకు ఎన్నికైన కౌన్సిలర్లు హైదరాబాద్‌లోని క్యాంపుల్లో పార్టీల అధిష్ఠానం దృష్టిని దాటిపోకుండా ఉండేందుకు ఈ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.
కౌన్సిలర్ రేపు నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లి తమ పార్టీలు ఎంపిక చేసిన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ అభ్యర్థులకు ఓటు వేయాలని పార్టీ నాయకత్వాలు ఆదేశించాయి. కౌన్సిలర్లు పార్టీ నాయకత్వాలు విఫ్‌లు జారీ చేశాయి. స్వతంత్ర అభ్యర్థులకు సకల సౌకర్యాలు కల్పించి తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు రాజకీయ పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి. శ్రీకాకుళం మున్సిపాలిటీ కాంగ్రెస్ కౌన్సిలర్లు విశాఖపట్నంలో ఉంటున్నారు.
హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల విషయంలో రాజకీయ పార్టీలు ఇప్పటికీ కసరత్తులు కొనసాగిస్తున్నాయి. విజయనగరం మున్సిపాలిటీని బహుజన సమాజ్ పార్టీ సహకారంతో కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. అదే విధంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications