బీహార్ పోలింగ్‌కు ఇసి పోలీసు బృందం
న్యూఢిల్లీ: బీహార్ శాసనసభ ఎన్నికల సందర్భంగా భద్రతాచర్యలను కట్టుదిట్టం చేసి సమన్వయం చేసేందుకు ఎన్నికల కమీషన్ నలుగురు సీనియర్ పోలీసు అధికారులతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని శాంతిభద్రతలను ఈ టీమ్ పర్యవేక్షిస్తుంది. ఈ టీమ్‌కు పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఆశిష్ రంజన్ సిన్హా నేతృత్వం వహిస్తారు. ఈ టీమ్‌లో ఇద్దరు అదపు డైరెక్టర్స్ జనరల్ అభయానంద్, మనోజ్‌నాథ్, ఐజిపి కృష్ణ చౌదరి ఉంటారు.
అభయానంద్ బలగాల కదలికలను, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారు. పోలింగ్ సందర్భంగా బలగాల నియోగం వంటి పనులను నాథ్ చూస్తారు. వచ్చే నెలలో నాలుగు దశల్లో బీహార్ శాసనసభకు ఎన్నికలు జరుగతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications