విజయనగరంలో టిడిపికి ఆశాభంగం
విజయనగరం: విజయనగరం మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీకి ఆశాభంగం తప్పలేదు. ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో బహుజన సమాజ్ పార్టీ (బియస్పీ) సహకారం తీసుకరుంటే తప్ప తెలుగుదేశం గానీ, కాంగ్రెస్ గానీ పాలక మండలిని ఏర్పాటు చేసే స్థితిలో లేవు. దీంతో తెలుగుదేశం నాయకులు గురువారం బియస్పీ నాయకులతో మంతనాలు జరిపారు. బియస్పీ కూడా మొదట సుముఖంగానే కనిపించింది. రాష్ట్ర నాయకత్వాలు పరస్పరం గురువారం హైదరాబాద్‌లో చర్చించుకున్నాయి. అయితే ఒక్కసారి రాజకీయాలు మారిపోయాయి.
కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు బియస్పీ ముందుకు వచ్చింది. ఇందుకు గాను ఇరు పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మొదటి రెండున్న సంవత్సరాలు కాంగ్రెస్ చైర్ పర్సన్ పదవిని అధిష్ఠిప్తే చివరి రెండున్నర ఏళ్లు బియస్సీ ఆ పదవిలో కొనసాగుతుంది. ఈ ఒప్పందం మేరకు విజయనగరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌కు చెందిన మీసాల గీత, వైస్ చైర్ పర్సన్‌గా బియస్సీకి చెందిన అవమానపు సూరిబాబు ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications
