వరంగల్ కాంగ్రెస్‌లో ముసలం
వరంగల్: వరంగల్ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల ఎంపికపై వరంగల్ కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. వరంగల్ కార్పోరేషన్ మేయర్ పదవికి ఎర్రబెల్లి స్వర్ణను, డిప్యూటి మేయర్ పదవికి ఎంబాటి రవీందర్‌లను అభ్యర్థులుగా ఎంపిక చేసింది. తన భార్య జ్యోతికి మేయర్ పదవికి దక్కకపోవడంతో జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుడు గండ్రా వెంకటరమణా రెడ్డి వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పరిశీలకుడిగా వచ్చిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వెంకటరమణా రెడ్డి వర్గం నిలదీసింది. ఆయనను ఎటూ కదలకుండా అడ్డగించి ఆయన వాహనాన్ని ధ్వంసం చేసింది.
ఎట్టకేలకు వరంగల్ కార్పోరేషన్ మేయర్ పదవికి ఎన్నిక జరిగింది. మేయర్‌గా ఎర్రబెల్లి స్వర్ణ 41 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఎంబాటి రవీందర్ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. కార్పోరేటర్ శ్రీధర్ చేసిన దాడిలో సుశీల్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సుశీల్‌కుమాఱ్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications
