కూతుళ్ళనురేప్ చేసిన తండ్రికి పదేళ్ళ శిక్ష
లక్నో: కన్నకూతుళ్లను మానభంగం చేసిన ఓకామాంధుడైన తండ్రికి కోర్టుపదేళ్ల జైలుశిక్ష విధించింది. లక్నోకి చెందినమహమ్మద్ హషీమ్ తనఇద్దరు కూతుళ్లను మూడేళ్లపాటు లైంగికంగావేధించి మానభగానికి పాల్పడ్డాడు. దీనితోపెద్ద కూతురికి తన తండ్రి ద్వారాముగ్గురు పిల్లలు పుట్టారు. పదహారేళ్లవయస్సులోనేచిన్న కూతురికి ఒక బిడ్డ కల్గింది. తండ్రికసాయి తనానికి భయపడి వీరు ఈవిషయాన్నిఎవ్వరికీ చెప్పలేక లోలోన కుమిలిపోయారు.చెబితే సమాజపరంగా ఎదురయ్యే ఇబ్బందులకుభయపడి క్షణక్షణం నరకం అనుభవించారు.
అయితే తండ్రిఅఘాయిత్యాలకు ఓర్వలేక ఇంటినుంచి పారిపోయిన చిన్నకూతురు గత ఏడాది పోలీసులకు ఫిర్యాదుచేసింది. మొదట్లోహషీమ్ తప్పును ఒప్పుకోలేదు. తనఇంటికోసమే కూతుళ్లు ఈ ఆరోపణలు చేస్తున్నారనిబుకాయించాడు. అయితే డిఎన్‌ఎ పరీక్షల అనంతరంనిజం నిర్ధారణ కావడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు.కూతుళ్లిద్దరికీ కల్గిన నలుగురుఅమాయకపిల్లలు ఇప్పుడు అనాథ శరణాలయంలో ఉన్నారు.
కోర్టుతీర్పుతోహషీమ్ కుటుంబం కొంత ఊరట చెందింది. అయితేహషీమ్‌కు ఉరిశిక్షగాని లేక కనీసం యావజ్జీవితజైలు శిక్ష విధించాలని త్వరలో పిటిషన్‌వేయనున్నారు. లేకుంటే పదేళ్లతర్వాత హషీమ్ తమను చంపేస్తాడనిభయపడుతున్నారు.












Click it and Unblock the Notifications
