తెనాలి మునిసిపల్‌చైర్‌పర్సన్‌గా మస్తానమ్మ
గుంటూరు: తెనాలిమునిసిపల్ చైర్‌పర్సన్‌గాతాడిబోయిన మస్తానమ్మ ఎన్నికయ్యారు.చైర్మన్ అభ్యర్ధిపైకాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలకారణంగా శుక్రవారం ఎన్నికజరుగలేదు. తెనాలి ఎంపీ బాలశౌరి, తెనాలిఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌లుతమ తమ మనుషులను చైర్మన్‌నుచేయాలని పట్టు పట్టడంతోఘర్షణ వాతారణం నెలకొని తెనాలిలో144వ సెక్షన్ విధించవలసి వచ్చింది. చైర్మన్ ఎన్నికనుశనివారానికి వాయిదా వేశారు. ఎమ్మెల్యేనాదెండ్లమనోహర్ వర్గీయులు సమావేశానికిహాజరు కాకపోవడంతో కోరం సరిపోలేదు. సరిగ్గా ఆసమయంలో ఎంపీ బాలశౌరి చక్రం తిప్పారు. టిడిపికౌన్సిలర్లను సమావేశానికి రప్పించిఎన్నిక జరిపించి తమ అభ్యర్ధి అయినతాడికొండ మస్తానమ్మనుచైర్‌పర్సన్‌గా గెలిపించుకున్నారు.తెలుగుదేశం కౌన్సిలర్లు నలుగురు పార్టీఆదేశాలను ధిక్కరించి సమావేశానికి హాజరు కావడంతోబాలశౌరి వర్గానిదే పైచేయి అయింది.












Click it and Unblock the Notifications
