బ్యాడ్‌బాల్ కోసం బాబు వెయిట్ చేయాలి: ఎమ్మెస్
కాళహస్తి: ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా సమయం కోసం వేచి చూడాలని రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణ రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు సలహా ఇచ్చారు. తమ ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి పాలన ఫుల్ స్వింగ్‌లో ఉందని, ఇప్పుడు చంద్రబాబు ఏమి మాట్లాడినా ఫలితం ఉండదని ఆయన అన్నారు. ఆయన సోమవారంనాడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవాలయంలో రాహువు, కేతువు పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఆస్ట్రేలియా బౌలర్లు బ్రెట్‌లీ, మేక్‌గ్రాత్‌ల బౌలింగ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టు వాష్ అవుట్ అయినట్లు చంద్రబాబు జట్టు వాష్ అవుట్ అవుతుందని, వైయస్ పాలన ఆ బౌలర్ల బంతుల్లాగా స్వింగ్ అవుతోందని ఆయన అన్నారు. బ్యాడ్ బాల్ కోసం చంద్రబాబు నిరీక్షించడం మంచిదని ఆయన అన్నారు. స్వింగ్ బంతులను షాట్ కొట్టే ప్రయత్నం చేయడం చంద్రబాబుకు మంచిది కాదని ఆయన అన్నారు. పాత మిత్రుడ్ని కాబట్టి చంద్రబాబుకు సలహా ఇస్తున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
