ముజీబ్ బావమరిది జహంగీర్ అరెస్టు?
హైదరాబాద్: ముస్లిం తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు మరొకరిని అరెస్టు చేసినట్లు సమాచారం. లష్కర్ - ఎ - తోయిబా నేత ముజీబ్ బావమరది జహంగీర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ముజీబ్ నుంచి క్యాసెట్లను తీసికెళ్లి లష్కర్ - ఎ - తోయిబా ఛీఫ్ మసూద్‌కు చేరవేయడంలో జహంగీర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు జహంగీర్‌ను విచారించే అవకాశం ఉంది.
ఇదిలావుంటే, బెంగుళూర్‌లోని ఐఐయస్‌సిపై దాడి కేసులో అరెస్టయిన అబ్దుల్ రెహ్మాన్ ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. నల్లగొండలోని రెహ్మాన్ ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications
