ఆస్ట్రేలియా ఓపెన్: 32వ సీడ్‌గా సానియా
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా 32వ సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఈ టోర్నమెంట్ వచ్చే వారం ప్రారంభం కానుంది. గ్రాండ్‌స్లామ్‌లో ర్యాంకింగ్ పొందిన తొలి భారతీయ క్రీడాకారిణి సానియా మీర్జా.
సానియా మీర్జా 2005లో 206 ర్యాంక్‌తో ప్రారంభమై 31 ర్యాంక్‌కు చేరుకుని సంచలనం సృష్టించింది. గత సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో సానియా సంచలనాలు సృష్టించడం ప్రారంభించింది. ఈ గ్రాండ్ స్లామ్‌లో మూడో రౌండ్‌కు చేరుకున్న తొలి భారతీయ క్రీడాకారణిగా ఆమె చరిత్ర సృష్టించింది. మూడో రౌండ్‌లో సెరినా విలియమ్స్ చేతిలో ఓడిపోయింది.












Click it and Unblock the Notifications
