సవాల్‌ను స్వీకరిస్తా, రాజీనామా చేస్తా: జయప్రకాశ్‌

హైదరాబాద్‌: తమ పార్టీ నేత కె. చంద్రశేఖర్‌ రావు సవాల్‌ను స్వీకరించి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి అంటున్నారు. పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత తాను రాజీనామా చేస్తానని ఆయన ఒక తెలుగు టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అసమ్మతి శాసనసభ్యులందరి తరఫున తానొక్కడినే రాజీనామా చేస్తున్నానని, ఇది తన వ్యక్తిగత నిర్ణయమని ఆయన చెప్పారు.

తాము తెలంగాణ ద్రోహులం కాదని, తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణ రావడానికి సమయం పడుతుందని, అందువల్ల అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందనేది తమ అభిమతమని, దీన్ని చంద్రశేఖర్‌ రావు గుర్తించాలని ఆయన అన్నారు. అభివృద్ధిని ముందు పెట్టి తెలంగాణ సాధన కోసం తాము పాటుపడుతామని ఆయన చెప్పారు. అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని, అందువల్ల తిరిగి తనను సంగారెడ్డి నియోజకవర్గం ఓటర్లు గెలిపిస్తారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+