హోటల్ గదిలో ఐటి దాడులు: ఇద్దరి అరెస్టు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఒక హోటల్‌పై దాడి చేసి అందులో బస చేసిన ఇద్దరు వ్యక్తులను ఆదాయం పన్ను (ఐటి) శాఖ అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి అధికారులు రెండు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు.
రాజ్యసభ ఎన్నికల్లో కొందరు అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బ తీయడానికి స్వతంత్ర అభ్యర్థులను రంగంలోకి దించాలనే ప్రయత్నంలో భాగంగా వీరిద్దరూ డబ్బులతో హోటల్ దిగినట్లు భావిస్తున్నారు. హోటల్‌పై దాడి చేసిన అధికారుల్లో ఆదాయం పన్ను శాఖ అదనపు కమీషనర్ కూడా ఉన్నారు. దాడి సందర్భంగా అధికారులు మీడియా ప్రతినిధులను అనుమతించలేదు.












Click it and Unblock the Notifications
