టీమిండియాలోకి బేబీ బాస్ ఎంట్రీ.. భారత్-ఆఫ్ఘన్ టీ20 పోరు ఫ్రీగా ఎలా చూడాలంటే?
భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెప్టెంబర్ 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి. శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు సారథ్యం వహించనుండగా.. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ సిరీస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. ఈ సిరీస్‌లో అన్ని మ్యాచ్ లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి.
టీమిండియాలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రాగా.. జింబాబ్వే పర్యటనలో ఉన్న రింకూ సింగ్‌ను ఈ మ్యాచ్‌ల నుంచి తొలగించారు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పూర్తి ఫిట్‌నెస్ సాధించగా.. జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డిల సెలెక్షన్ వారి ఫిట్‌నెస్ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఇబ్రహీం జద్రాన్ నాయకత్వం వహిస్తున్నారు.

ఈ టీ20 సిరీస్ ఎక్కడ వీక్షించాలంటే?
ఇండియాలో ఈ టీ20 సిరీస్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్షప్రసారం కానుంది. అలాగే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో చూడాలనుకునే అభిమానులు ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ ను వీక్షించవచ్చు. ఈ మూడు మ్యాచ్‌లు సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతాయి. భారత క్రికెట్ అభిమానులు ఈ సిరీస్‌లో ఉత్కంఠభరితమైన పోటీలను ఆశించవచ్చు. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .
టీమిండియా జట్టు : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా .
ఆఫ్ఘనిస్థాన్ జట్టు: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నూర్ రెహ్మాన్ (వికెట్ కీపర్), సెడిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఉమర్‌జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగియలై ఖరోటి, నూర్ అహ్మద్, ముజీబుర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫరూకీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, నవీన్-ఉల్-హక్
భారత్- ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ పూర్తి షెడ్యూల్
మొదటి టీ20 - సెప్టెంబర్ 13, 2026, అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ)
రెండో టీ20 - సెప్టెంబర్ 15, 2026, అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ)
మూడో టీ20ఐ - సెప్టెంబర్ 17, 2026, అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ)













Click it and Unblock the Notifications
