"ముందు ఆ పని చేయండి సార్..!"- జగన్ ట్వీట్ కు టీఎంసీ ఎంపీ కౌంటర్..!

కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్లను లెక్కచేయకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ ( సీఈసీ )జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ జవాబు చెప్పాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఈ డిమాండ్ వినిపిస్తుండగా.. ఎన్టీయేకు ప్రత్యక్ష మిత్రపక్షాలతో పాటు పరోక్ష మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న వైఎస్సార్సీపీ కూడా దీనిపై స్పందించింది. ఎన్నికల కమిషనర్ల నియామకం, తాజా వివాదంపై జగన్ నిన్న సుదీర్ఘ ట్వీట్ చేశారు.

కేంద్రానికి జగన్ బిగ్ షాక్ - ఆ చట్టం వెనక్కి- ఈసీ వివాదంపై సంచలన డిమాండ్స్ ...!
కేంద్రానికి జగన్ బిగ్ షాక్ - ఆ చట్టం వెనక్కి- ఈసీ వివాదంపై సంచలన డిమాండ్స్ ...!

ఇందులో జగన్ ఎన్నికల సంఘంలో తలెత్తిన వివాదాలను తప్పుబట్టడమే కాకుండా, ఈసీ నిష్పాక్షికత, పారదర్శకత పాటించాలని సూచించారు. ఇందుకోసం ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలో గతంలో కేంద్రం చేసిన సవరణ చట్టాన్ని.. మారిన పరిస్ధితుల్లో తిరిగి సమీక్షించాలని కోరారు. దీంతో జగన్ ట్వీట్ చర్చనీయాంశమైంది. గతంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి అవసరం ఉన్నా లేకపోయినా మద్దతు ఇచ్చి పలు కీలక బిల్లుల్ని గట్టెక్కించిన జగన్.. ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారా అన్న చర్చ సాగుతోంది.

Mahua Moitra Hits Back at Jagan Over CEC Row Urges YSRCP to Stop Backing Centre
ఈసీ వివాదంలో ఎన్డీయే మిత్రుల షాకులు- వైఎస్సార్సీపీ బాటలో టీడీపీ, మరో 2 పార్టీలు..!
ఈసీ వివాదంలో ఎన్డీయే మిత్రుల షాకులు- వైఎస్సార్సీపీ బాటలో టీడీపీ, మరో 2 పార్టీలు..!

ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో భాగమైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) వైఎస్ జగన్ ట్వీట్ పై స్పందించారు. ఓవైపు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి పరోక్ష మద్దతునిస్తూ, ఇప్పుడు ఇలాంటి ట్వీట్లు పెట్టడం ఏంటని పరోక్షంగా జగన్ ను ఆమె ప్రశ్నించారు. జగన్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఆమె.. కాబట్టి అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ఆపండి అని సూచించారు. కేంద్రం చేపట్టబోతున్న డీలిమిటేషన్‌కు మద్దతు ఇవ్వకుండా మీ ఎంపీలను ఆపండి అని జగన్ ను కోరారు. సంస్థలను నాశనం చేసి, ఆ తర్వాత ప్రజల మెప్పు కోసం పాకులాడే వాళ్లకే మద్దతు ఇవ్వకండి సార్ అంటూ మహువా మెయిత్రా వైసీపీ అధినేతను అభ్యర్ధించారు. ఇప్పటికే ఎన్డీయే మిత్రపక్షాలైన టీడీపీ, లోక్ జన్ శక్తి, ఆర్ఎల్ఎమ్ వంటి పార్టీలు ఈసీ వివాదంపై సీఈసీ వివరణ ఇవ్వాలని కోరుతున్నాయి. ఇప్పుడు జగన్ కూడా అదే డిమాండ్ చేస్తుండటంతో కేంద్రం ఉక్కిరిబిక్కిరవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+