ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తు: చంద్రబాబు
హైదరాబాద్: భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. అస్సాం ఎన్నికల్లో ప్రచారం చేయడానికి బయలుదేరే ముందు ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రాంతీయ పార్టీలు అన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నాయని, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఈ పార్టీలే ముందున్నాయని ఆయన అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రాంతీయ పార్టీలు చూపిన శ్రద్ధ ఎనలేనిదని ఆయన అన్నారు. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితమయ్యాయని, వాటి బలం 50 శాతం కూడా లేదని ఆయన అన్నారు. ప్రజల విశ్వాసం ప్రాంతీయ పార్టీలకే ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
