రాజీవ్ ఫౌండేషన్ పదవికీ సోనియా రాజీనామా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. లాభదాయకమైన జోడు పదవుల వివాదం నేపథ్యంలో ఆమె శనివారం ఆ పదవికి రాజీనామా చేశారు.
ఇదివరకే సోనియా గాంధీ లోక్‌సభ సభ్యత్వానికి, జాతీయ అభివృద్ధి మండలి చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశారు. రాయ్‌బరేలీ నుంచి ఆమె తిరిగి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. రాయ్‌బరేలీ ఉప ఎన్నిక వచ్చే నెల 8వ తేదీన జరుగుతోంది. లాభదాయకమైన జోడు పదవుల విషయంలో జయా బచ్చన్ సభ్యత్వాన్ని ఎన్నికల కమీషన్ రద్దు చేయడంతో వివాదం తెర మీదికి వచ్చింది. దీంతో సోనియా తన పదవులకు రాజీనామా చేయక తప్పలేదు.












Click it and Unblock the Notifications
