తెలుగుదేశం పార్టీకి గద్దే బాబూరావు రాజీనామా
విజయనగరం: తెలుగుదేశం విజయనగరం జిల్లా చీపురుపల్లి మాజీ శాసనసభ్యుడు గద్దే బాబూరావు పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠాన వర్గానికి పంపినట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధులకు తెలిపారు. తమ పార్టీలోని జిల్లా నాయకుల తీరు పట్ల మనస్తాపం చెంది రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.
తాను ఏ పార్టీలోనూ చేరబోనని ఆయన స్పష్టం చేశారు. తనకు కాంగ్రెస్ నుంచి ఏ విధమైన పోటీ లేదని, తన పార్టీలోనివారితోనే తనకు పోటీ వుందని ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని నాయకుల తీరుపై తాను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పార్టీ నాయకత్వాలకు తెలియజేశానని, అయితే జిల్లా నాయకత్వాలు ఏ మాత్రం స్పందించలేదని ఆయన అన్నారు. తాను పార్టీ ఆవిర్భాం నుంచి ఉన్నానని, అయినా తనకు పార్టీలో తగిన గుర్తింపు లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
