హైదరాబాద్ కోర్టులో అలూకాస్ నిందితులు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని అలూకాస్ నగల దుకాణం దొంగతనం కేసులో నిందితులను హైదరాబాద్ పోలీసులు నగరానికి తీసుకొచ్చారు. అలూకాస్ నగల దుకాణంలో దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను ఇటీవల ముంబాయి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముంబాయి కోర్టు విధించిన రిమాండ్ గడువు మంగళవారంనాటితో ముగిసింది. దీంతో వారిని హైదరాబాద్ పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.
నిందితులను పోలీసులు బుధవారం నాంపల్లిలోని మూడో ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వారికి వచ్చే 13వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ నిమిత్తం వారిని తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తూ హైదరాబాద్ పోలీసులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను 15 రోజులపాటు తమకు అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు.












Click it and Unblock the Notifications
