సోనియా రాజీనామాకు బిజెపి డిమాండ్
న్యూఢిల్లీ: లాభదాయక పదవుల బిల్లును రాష్ట్రపతి తిరిగి పంపిన నేపథ్యంలో లోక్‌సభ సభ్యత్వానికి సోనియా గాంధీ రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ బుదవారంనాడు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి నిర్ణయం తమ వైఖరి సరైందనే విషయాన్ని తేల్చి చెబుతోందని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. లాభదాయక పదవుల విషయంలో తన వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని కేసులను వెంటనే పరిష్కరించాలని ఆయన ఎన్నికల కమీషన్‌కు విజ్ఞప్తి చేశారు.
ఈ అంశంపై రాష్ట్రపతి సూచనను స్ఫూర్తిగా తీసుకొని లాభదాయక పదవుల విషయంలో పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాయబరేలీ సీటుకు సోనియా రాజీనామా చేయడమనేది ఇప్పటికీ వర్తిస్తుందని ఆయన అన్నారు. రాజీనామా చేయాలని రాయబరేలీ ప్రజలు అడగలేదని, అయితే ఆదర్శంగా, నీతివంతంగా ఉన్నానని చెప్పుకోవడానికి సోనియా రాజీనామా చేశారని, కానీ పరిస్థితులు గానీ, కారణాలు గానీ మారలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
